Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Saturday, September 28, 2013

1వ దినవృత్తాంతములు 1

1Ch 1:1  ఆదాము షేతు ఎనోషు 
1Ch 1:2  కేయినాను మహలలేలు యెరెదు 
1Ch 1:3  హనోకు మెతూషెల లెమెకు 
1Ch 1:4  నోవహు షేము హాము యాపెతు. 
1Ch 1:5  యాపెతు కుమారులు; గోమెరు మాగోగు మాదయి యావాను తుబాలు మెషెకు తీరసు అనువారు. 
1Ch 1:6  గోమెరు కుమారులు అష్కనజు రీఫతు తోగర్మా. 
1Ch 1:7  యావాను కుమారులు ఎలీషా తర్షీషు కిత్తీము దోదా నీము. 
1Ch 1:8  హాము కుమారులు; కూషు మిస్రాయిము పూతు కనాను. 
1Ch 1:9  కూషు కుమారులు సెబా హవీలా సబ్తా రాయమా సబ్తకా. రాయమా కుమారులు షెబదదాను. 
1Ch 1:10  కూషు నిమ్రోదును కనెను, ఇతడు భూమిమీది పరాక్రమశాలులలో మొదటివాడు. 
1Ch 1:11  లూదీయులు అనామీ యులు లెహాబీయులు నప్తుహీయులు 
1Ch 1:12  పత్రుసీయులు ఫిలిష్తీయుల వంశకర్తలైన కస్లూహీయులు కఫ్తోరీయులు మిస్రాయిము సంతతివారు. 
1Ch 1:13  కనాను తన జ్యేష్ఠకుమారుడైన సీదోనును హేతును కనెను. 
1Ch 1:14  యెబూసీయులు అమోరీయులు గిర్గాషీయులు 
1Ch 1:15  హివ్వీయులు అర్కీయులు సీనీయులు 
1Ch 1:16  అర్వాదీయులు సెమారీయులు హమాతీయులు అతని సంతతివారు. 
1Ch 1:17  షేము కుమారులు; ఏలాము అష్షూరు అర్పక్షదు లూదు అరాము ఊజు హూలు గెతెరు మెషెకు. 
1Ch 1:18  అర్పక్షదు షేలహును కనెను. షేలహు ఏబెరును కనెను. 
1Ch 1:19  ఏబెరునకు ఇద్దరు కుమారులు పుట్టిరి, ఒకని దినములలో భూమి విభాగింపబడెను గనుక అతనికి పెలెగు అని పేరు పెట్టబడెను, అతని సహోదరుని పేరు యొక్తాను. 
1Ch 1:20  యొక్తాను అల్మోదాదును షెలపును హసర్మావెతును యెరహును 
1Ch 1:21  హదోరమును ఊజాలును దిక్లానును 
1Ch 1:22  ఏబాలును అబీమా యేలును షేబను 
1Ch 1:23  ఓఫీరును హవీలాను యోబాలును కనెను, వీరందరును యొక్తాను కుమారులు. 
1Ch 1:24  షేము అర్పక్షదు షేలహు ఏబెరు పెలెగు రయూ 
1Ch 1:25  సెరూగు నాహోరు తెరహు 
1Ch 1:26  అబ్రాహామను పేరు పెట్టబడిన అబ్రాము. 
1Ch 1:27  అబ్రాహాము కుమారులు, 
1Ch 1:28  ఇస్సాకు ఇష్మాయేలు. 
1Ch 1:29  వీరి తరములు ఏవనగా ఇష్మాయేలునకు జ్యేష్ఠ కుమారుడు నెబాయోతు తరువాత కేదారు అద్బయేలు మిబ్శాము 
1Ch 1:30  మిష్మా దూమా మశ్శా హదదు తేమా 
1Ch 1:31  యెతూరు నాపీషు కెదెమా; వీరు ఇష్మాయేలు కుమారులు. 
1Ch 1:32  అబ్రాహాముయొక్క ఉపపత్నియైన కెతూరా కనిన కుమారులు ఎవరనగా జిమ్రాను యొక్షాను మెదానుమిద్యాను ఇష్బాకు షూవహు. యొక్షాను కుమారులు షేబదాను. 
1Ch 1:33  మిద్యాను కుమారులు, ఏయిఫా ఏఫెరు హనోకు అబీదా ఎల్దాయా; వీరందరును కెతూరాకు పుట్టిన కుమారులు. 
1Ch 1:34  అబ్రాహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు కుమారులు ఏశావు ఇశ్రాయేలు. 
1Ch 1:35  ఏశావు కుమారులు ఏలీఫజు రెయూ వేలు యెయూషు యాలాము కోరహు. 
1Ch 1:36  ఎలీఫజు కుమా రులు తేమాను ఓమారు సెపో గాతాము కనజు తిమ్నా అమాలేకు. 
1Ch 1:37  రెయూవేలు కుమారులు నహతు జెరహు షమ్మా మిజ్జ. 
1Ch 1:38  శేయీరు కుమారులు లోతాను శోబాలు సిబ్యోను అనా దిషోను ఏసెరు దిషాను. 
1Ch 1:39  లోతాను కుమా రులు హోరీ హోమాము; తిమ్నా లోతానునకు సహోదరి. 
1Ch 1:40  శోబాలు కుమారులు అల్వాను మనహతు ఏబాలు షెపో ఓనాము. సిబ్యోను కుమారులు అయ్యా అనా. 
1Ch 1:41  అనా కుమారులలో ఒకనికి దిషోను అనిపేరు. దిషోను కుమారులు హమ్రాను ఎష్బాను ఇత్రాను కెరాను. 
1Ch 1:42  ఏసెరు కుమారులు బిల్హాను జవాను యహకాను. దిషాను కుమారులు ఊజు అరాను. 
1Ch 1:43  ఏ రాజును ఇశ్రాయేలీయులను ఏలకమునుపు ఎదోము దేశమందు ఏలిన రాజులు వీరు; బెయోరు కుమారుడైన బెల అతని పట్టణము పేరు దిన్హాబా. 
1Ch 1:44  బెల చనిపోయిన తరువాత బొస్రా ఊరివాడైన జెరహు కుమారుడైన యోబాబు అతనికి బదులుగా రాజాయెను. 
1Ch 1:45  యోబాబు చనిపోయిన తరువాత తేమానీయుల దేశపు వాడైన హుషాము అతనికి బదులుగా రాజాయెను. 
1Ch 1:46  హుషాము చనిపోయిన తరువాత మోయాబు దేశమున మిద్యానీయులను హతముచేసిన బెదెదు కుమారుడైన హదదు అతనికి బదులుగా రాజాయెను; ఇతని పట్టణము పేరు అవీతు. 
1Ch 1:47  హదదు చనిపోయిన తరువాత మశ్రేకా ఊరివాడైన శవ్లూ అతనికి బదులుగా రాజాయెను. 
1Ch 1:48  శవ్లూ చనిపోయిన తరువాత నది దగ్గరనున్న రహెబోతువాడైన షావూలు అతనికి బదులుగా రాజాయెను. 
1Ch 1:49  షావూలు చని పోయిన తరువాత అక్బోరు కుమారుడైన బయల్‌హానాను అతనికి బదులుగా రాజాయెను. 
1Ch 1:50  బయల్‌హానాను చని పోయిన తరువాత హదదు అతనికి బదులుగా రాజాయెను; ఇతని పట్టణము పేరు పాయు. ఇతని భార్యపేరు మెహేతబేలు; ఈమె మేజాహాబు కుమార్తెయైన మత్రేదు నకు పుట్టినది. 
1Ch 1:51  హదదు చనిపోయిన తరువాత ఎదోము నందు ఉండిన నాయకులెవరనగా తిమ్నా నాయకుడు, అల్వా నాయకుడు, యతేతు నాయకుడు, 
1Ch 1:52  అహలీబామానాయకుడు, ఏలా నాయకుడు, పీనోను నాయకుడు, 
1Ch 1:53  కనజు నాయకుడు, తేమాను నాయకుడు, మిబ్సారు నాయకుడు, 
1Ch 1:54  మగ్దీయేలు నాయకుడు, ఈలాము నాయ కుడు; వీరు ఎదోముదేశమునకు నాయకులు. 

1వ దినవృత్తాంతములు 2

1Ch 2:1   
1Ch 2:2  దాను యోసేపు బెన్యామీను నఫ్తాలి గాదు ఆషేరు. 
1Ch 2:3  యూదా కుమారులు ఏరు ఓనాను షేలా. ఈ ముగ్గురు కనానీయురాలైన షూయ కుమార్తెయందు అతనికి పుట్టిరి. యూదాకు జ్యేష్ఠకుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడైనందున ఆయన వానిని చంపెను. 
1Ch 2:4  మరియు అతని కోడలైన తామారు అతనికి పెరెసును జెరహును కనెను. యూదా కుమారులందరును అయిదు గురు. 
1Ch 2:5  పెరెసు కుమారులు హెస్రోను హామూలు. 
1Ch 2:6  జెరహు కుమారులు అయిదుగురు, జిమీ ఏతాను హేమాను కల్కోలు దార. 
1Ch 2:7  కర్మీ కుమారులలో ఒకనికి ఆకాను అని పేరు; ఇతడు శాపగ్రస్తమైన దానిలో కొంత అపహరించి ఇశ్రాయేలీయులను శ్రమపెట్టెను. 
1Ch 2:8  ఏతాను కుమారులలో అజర్యా అను ఒకడుండెను. 
1Ch 2:9  హెస్రోనునకు పుట్టిన కుమారులు యెరహ్మెయేలు రాము కెలూబై. 
1Ch 2:10  రాము అమీ్మనాదాబును కనెను, అమీ్మనాదాబు యూదావారికి పెద్దయైన నయస్సోనును కనెను. 
1Ch 2:11  నయస్సోను శల్మాను కనెను, శల్మా బోయజును కనెను, 
1Ch 2:12  బోయజు ఓబేదును కనెను, ఓబేదు యెష్షయిని కనెను, 
1Ch 2:13  యెష్షయి తన జ్యేష్ఠ కుమారుడైన ఏలీయాబును రెండవవాడైన అబీనాదాబును మూడవవాడైన షమ్మాను 
1Ch 2:14  నాలుగవవాడైన నెతనేలును, అయిదవవాడైన రద్దయిని 
1Ch 2:15  ఆరవవాడైన ఓజెమును ఏడవ వాడైన దావీదును కనెను. 
1Ch 2:16  సెరూయా అబీగయీలు వీరి అక్కచెల్లెండ్రు. సెరూయా కుమారులు ముగ్గురు, అబీషై యోవాబు అశాహేలు. 
1Ch 2:17  అబీగయీలు అమాశాను కనెను; ఇష్మాయేలీయుడైన యెతెరు అమాశాకు తండ్రి. 
1Ch 2:18  హెస్రోను కుమారుడైన కాలేబు అజూబా అను తన భార్యయందును యెరీయోతునందును పిల్లలను కనెను. అజూబా కుమారులు ఎవరనగా యేషెరు షోబాబు అర్దోను. 
1Ch 2:19  అజూబా చనిపోయిన తరువాత కాలేబు ఎఫ్రాతాను వివాహము చేసికొనగా అది అతనికి హూరును కనెను. 
1Ch 2:20  హూరు ఊరిని కనెను, ఊరి బెసలేలును కనెను. 
1Ch 2:21  తరువాత హెస్రోను గిలాదు తండ్రియైన మాకీరు కుమార్తెను కూడెను; తాను అరువది సంవత్సరముల వయస్సుగలవాడైనప్పుడు దానిని వివాహము చేసికొనగా అది అతనికి సెగూబును కనెను. 
1Ch 2:22  సెగూబు యాయీరును కనెను, ఇతనికి గిలాదు దేశమందు ఇరువదిమూడు పట్ట ణము లుండెను. 
1Ch 2:23  మరియు గెషూరువారును సిరియనులును యాయీరు పట్టణములను కెనాతును దాని ఉపపట్టణము లను అరువది పట్టణములను వారియొద్దనుండి తీసికొనిరి. వీరందరును గిలాదు తండ్రియైన మాకీరునకు కుమాళ్లు. 
1Ch 2:24  కాలేబుదైన ఎఫ్రాతాలో హెస్రోను చనిపోయిన తరువాత హెస్రోను భార్యయైన అబీయా అతనికి తెకోవకు తండ్రియైన అష్షూరును కనెను. 
1Ch 2:25  హెస్రోను జ్యేష్ఠ కుమారుడైన యెరహ్మెయేలు కుమారులు ఎవరనగా జ్యేష్ఠు డగు రాము బూనా ఓరెను ఓజెము అహీయా. 
1Ch 2:26  అటారా అను ఇంకొక భార్య యెరహ్మెయేలునకు ఉండెను, ఇది ఓనామునకు తల్లి. 
1Ch 2:27  యెరహ్మెయేలునకు జ్యేష్ఠకుమారుడగు రాము కుమారులు మయజు యామీను ఏకెరు. 
1Ch 2:28  ఓనాము కుమారులు షమ్మయి యాదా, షమ్మయి కుమారులు నాదాబు అబీషూరు. 
1Ch 2:29  అబీషూరు భార్యపేరు అబీహయిలు, అది అతనికి అహ్బానును, మొలీదును కనెను. 
1Ch 2:30  నాదాబు కుమా రులు సెలెదు అప్పయీము. సెలెదు సంతానములేకుండ చనిపోయెను 
1Ch 2:31  అప్పయీము కుమారులలో ఇషీ అను ఒక డుండెను, ఇషీ కుమారులలో షేషాను అను ఒకడుండెను, షేషాను కుమారులలో అహ్లయి అను ఒకడుండెను, 
1Ch 2:32  షమ్మయి సహోదరుడైన యాదా కుమారులు యెతెరు యోనాతాను;యెతెరు సంతానములేకుండ చనిపోయెను. 
1Ch 2:33  యోనాతాను కుమారులు పేలెతు జాజా; వీరు యెరహ్మె యేలునకు పుట్టినవారు. 
1Ch 2:34  షేషానునకు కుమార్తెలే గాని కుమారులు లేకపోయిరి;ఈ షేషానునకు యర్హా అను ఒక దాసుడుండెను, వాడు ఐగుప్తీయుడు 
1Ch 2:35  షేషాను తన కుమార్తెను తన దాసుడైన యర్హాకు ఇయ్యగా అది అతనికి అత్తయిని కనెను. 
1Ch 2:36  అత్తయి నాతానును కనెను, నాతాను జాబాదును కనెను, 
1Ch 2:37  జాబాదు ఎప్లాలును కనెను, ఎప్లాలు ఓబేదును కనెను, 
1Ch 2:38  ఓబేదు యెహూను కనెను, యెహూ అజర్యాను కనెను, 
1Ch 2:39  అజర్యా హేలెస్సును కనెను, హేలెస్సు ఎలాశాను కనెను, 
1Ch 2:40  ఎలాశా సిస్మాయీని కనెను, సిస్మాయీ షల్లూమును కనెను, 
1Ch 2:41  షల్లూము యెక మ్యాను కనెను, యెకమ్యా ఎలీషామాను కనెను. 
1Ch 2:42  యెర హ్మెయేలు సహోదరుడైన కాలేబు కుమారులెవరనగా జీపు తండ్రియైన మేషా, యితడు అతనికి జ్యేష్ఠుడు. అబీ హెబ్రోను మేషాకు కుమారుడు. 
1Ch 2:43  హెబ్రోను కుమారులు కోరహు తప్పూయ రేకెము షెమ. 
1Ch 2:44  షెమ యోర్కెయాము తండ్రియైన రహమును కనెను, రేకెము షమ్మయిని కనెను. 
1Ch 2:45  షమ్మయి కుమారుడు మాయోను, ఈ మాయోను బేత్సూరునకు తండ్రి. 
1Ch 2:46  కాలేబు ఉపపత్నియైన ఏయిఫా హారానను మోజాను గాజేజును కనెను, హారాను గాజేజును కనెను. 
1Ch 2:47  యెహ్దయి కుమారులు రెగెము యోతాము గేషాను పెలెటు ఏయిఫా షయపు. 
1Ch 2:48  కాలేబు ఉపపత్నియైన మయకా షెబెరును తిర్హనాను కనెను. 
1Ch 2:49  మరియు అది మద్మన్నాకు తండ్రియైన షయపును మక్బే నాకును గిబ్యాకు తండ్రియైన షెవానును కనెను. కాలేబు కుమార్తెకు అక్సా అని పేరు. 
1Ch 2:50  ఎఫ్రాతాకు జ్యేష్ఠుడుగా పుట్టిన హూరు కుమారుడైన కాలేబు కుమారులు ఎవరనగా కిర్యత్యారీము తండ్రియైన శోబాలును, 
1Ch 2:51  బేత్లెహేము తండ్రియైన శల్మాయును, బేత్గాదేరు తండ్రియైన హారే పును. 
1Ch 2:52  కిర్యత్యారీము తండ్రియైన శోబాలు కుమారులెవ రనగా హారోయే హజీహమీ్మను హోతు. 
1Ch 2:53  కిర్యత్యారీముకుమారులెవరనగా ఇత్రీయులును పూతీయులును షుమ్మా తీయులును మిష్రాయీయులును; వీరివలన సొరాతీయు లును ఎష్తాయులీయులును కలిగిరి. 
1Ch 2:54  శల్మా కుమారులెవ రనగా బేత్లెహేమును నెటోపాతీయులును యోవాబు ఇంటి సంబంధమైన అతారోతీయులును మానహతీయులలో ఒక భాగముగానున్న జారీయులును. 
1Ch 2:55  యబ్బేజులో కాపురమున్న లేఖికుల వంశములైన తిరాతీయులును షిమ్యాతీయులును శూకోతీయులును; వీరు రేకాబు ఇంటి వారికి తండ్రియైన హమాతువలన పుట్టిన కేనీయుల సంబంధులు. 

1వ దినవృత్తాంతములు 3

1Ch 3:1   దావీదునకు హెబ్రోనులో పుట్టిన కుమారులెవరనగా యెజ్రెయేలీయురాలైన అహీనోయమునకు పుట్టిన అమ్నోను జ్యేష్ఠుడు; కర్మెలీయురాలైన అబీగయీలునకు పుట్టిన దానియేలు రెండవవాడు,
1Ch 3:2  గెషూరు రాజైన తల్మయి కుమార్తెయైన మయకాకు పుట్టిన అబ్షాలోము మూడవవాడు, హగ్గీతు కుమారుడైన అదోనీయా నాల్గవ వాడు, 
1Ch 3:3  అబీటలు కనిన షెఫట్య అయిదవవాడు, అతని భార్యయైన ఎగ్లాకనిన ఇత్రెయాము ఆరవవాడు, 
1Ch 3:4  ఈ ఆరుగురు హెబ్రోనులో అతనికి పుట్టిరి, అచ్చట అతడు ఏడు సంవత్సరముల ఆరునెలలు ఏలెను, 
1Ch 3:5  యెరూష లేములో ముప్పది మూడు సంవత్సరములు ఏలెను. యెరూషలేములో అతనికి పుట్టిన వారెవరనగా అమీ్మయేలు కుమార్తె యైన బత్షెబవలన కలిగిన షిమ్యా షోబాబు నాతాను సొలొమోను అను నలుగురు 
1Ch 3:6  ఇభారు ఎలీషామా ఎలీపేలెటు నోగహు నెపెగు యాఫీయ ఎలీషామా 
1Ch 3:7  ఎల్యాదా ఎలీపేలెటు అను తొమ్మండ్రు కుమారులు. 
1Ch 3:8  ఉపపత్నులవలన కలిగినవారుగాక వీరందరు దావీదునకు జననమైరి; తామారు వీరికి సహోదరి. 
1Ch 3:9  సొలొమోనునకు రెహబాము కుమారుడు, అతని కుమారుడు అబీయా. 
1Ch 3:10  అబీ యాకు ఆసా కుమారుడు, ఆసాకు యెహోషాపాతు కుమా రుడు 
1Ch 3:11  యెహోషాపాతునకు యెహోరాము కుమారుడు, యెహోరామునకు అహజ్యా కుమారుడు, అహజ్యాకు యోవాషు కుమారుడు, 
1Ch 3:12  యోవాషునకు అమజ్యా కుమారుడు అమజ్యాకు అజర్యా కుమారుడు, అజర్యాకు యోతాము కుమారుడు 
1Ch 3:13  యోతామునకు ఆహాజు కుమా రుడు, ఆహాజునకు హిజ్కియా కుమారుడు, హిజ్కియాకు మనష్షే కుమారుడు, 
1Ch 3:14  మనష్షేకు ఆమోను కుమారుడు, ఆమోనునకు యోషీయా కుమారుడు. 
1Ch 3:15  యోషీయా కుమారులెవరనగా జ్యేష్ఠుడు యోహానాను, రెండవవాడు యెహోయాకీము, మూడవవాడు సిద్కియా, నాల్గవవాడు షల్లూము. 
1Ch 3:16  యెహోయాకీము కుమారులలో యెకొన్యా అను ఒకడుండెను, అతని కుమారుడు సిద్కియా. 
1Ch 3:17  యకొన్యా కుమారులు అస్సీరు షయల్తీయేలు 
1Ch 3:18  మల్కీ రాము పెదాయా షెనజ్జరు యెకమ్యా హోషామా నెదబ్యా. 
1Ch 3:19  పెదాయా కుమారులు జెరుబ్బాబెలు షిమీ; జెరుబ్బాబెలు కుమారులు మెషుల్లాము హనన్యా; షెలోమీతు వారికి సహోదరి. 
1Ch 3:20  హషుబా ఓహెలు బెరెక్యాహసద్యా యూషబెస్హెదు అను మరి యయిదుగురుండిరి. 
1Ch 3:21  హనన్యా కుమారులు పెలట్యా యెషయా, రెఫాయా కుమారులును అర్నాను కుమారులును ఓబద్యా కుమారులును షెకన్యా కుమారులును. 
1Ch 3:22  షెకన్యా కుమారులలో షెమయా అను ఒకడుండెను; షెమయా కుమారులు ఆరుగురు. హట్టూషు ఇగాలు బారియహు నెయర్యా షాపాతు. 
1Ch 3:23  నెయర్యా కుమారులు ముగ్గురు. ఎల్యోయేనై హిజ్కియా అజ్రీకాము; 
1Ch 3:24  ఎల్యోయేనై కుమారులు ఏడుగురు; హోదవ్యా ఎల్యాషీబు పెలాయా అక్కూబు యోహానాను దెలాయ్యా అనాని. 

1వ దినవృత్తాంతములు 4

1Ch 4:1   
1Ch 4:2  శోబాలు కుమారుడైన రెవాయా యహతును కనెను, యహతు అహూమైని లహదును కనెను, ఇవి సొరాతీయుల వంశములు. 
1Ch 4:3  అబీయేతాము సంతతివా రెవరనగా యెజ్రెయేలు ఇష్మా ఇద్బాషు వీరి సహోదరి పేరు హజ్జెలెల్పోని. 
1Ch 4:4  మరియు గెదోరీయులకు పితరుడగు పెనూయేలును హూషాయీయులకు పితరుడగు ఏజెరును, వీరు బేత్లెహేమునకు తండ్రియైన ఎఫ్రాతాకు జ్యేష్ఠుడగు హూరునకు కుమారులు. 
1Ch 4:5  తెకోవ తండ్రియైన అష్షూరు నకు హెలా నయరా అను ఇద్దరు భార్యలుండిరి. 
1Ch 4:6  నయరా అతనికి అహుజామును హెపెరును తేమనీని హాయ హష్తారీని కనెను. వీరు నయరాకు పుట్టిన కుమా రులు. 
1Ch 4:7  హెలా కుమారు లెవరనగా జెరెతు సోహరు ఎత్నాను. 
1Ch 4:8  కోజు ఆనూబును జోబేబాను హారుము కుమారుడైన అహర్హేలుయొక్క వంశములను కనెను. 
1Ch 4:9  యబ్బేజు1 తన సహోదరులకంటె ఘనము పొందినవాడై యుండెను వేదనపడి యితని కంటినని అతని తల్లి అతనికి యబ్బేజు అని పేరుపెట్టెను. 
1Ch 4:10  యబ్బేజు ఇశ్రాయేలీ యుల దేవునిగూర్చి మొఱ్ఱపెట్టినీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాల పరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడురాకుండ దానిలోనుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవిచేసిన దానిని అతనికి దయచేసెను. 
1Ch 4:11  షూవహు సహోదరుడైన కెలూబు ఎష్తోనునకు తండ్రియైన మెహీరును కనెను. 
1Ch 4:12  ఎష్తోను బేత్రాఫాను పాసెయను ఈర్నాహాషునకు తండ్రియైన తెహిన్నాను కనెను, వీరు రేకావారు. 
1Ch 4:13  కనజు కుమారులు ఒత్నీయేలు శెరాయా; ఒత్నీయేలు కుమారులలో హతతు అను ఒక డుండెను. 
1Ch 4:14  మెయానొతై ఒఫ్రాను కనెను, శెరాయా పనివారి లోయలో నివసించువారికి తండ్రియైన యోవా బును కనెను, ఆ లోయలోనివారు పనివారై యుండిరి. 
1Ch 4:15  యెఫున్నె కుమారుడైన కాలేబు కుమారులు ఈరూ ఏలా నయము; ఏలా కుమారులలో కనజు అను ఒకడుండెను. 
1Ch 4:16  యెహల్లెలేలు కుమారులు జీఫు జీఫా తీర్యా అశర్యేలు. 
1Ch 4:17  ఎజ్రా కుమారులు యెతెరు మెరెదు ఏఫెరు యాలోను; మెరెదు భార్య మిర్యామును షమ్మయిని ఎష్టెమోను వారికి పెద్దయయిన ఇష్బాహును కనెను. 
1Ch 4:18  అతని భార్యయైన యెహూదీయా గెదోరునకు ప్రధానియైన యెరె దును శోకోకు ప్రధానియైన హెబెరును జానోహకు ప్రధానియైన యెకూతీయేలును కనెను. మెరెదు వివాహము చేసికొనిన ఫరో కుమార్తెయైన బిత్యాకు పుట్టిన కుమారులు వీరే. 
1Ch 4:19  మరియు నహము సహోదరియైన హూదీయా భార్యయొక్క కుమారులెవరనగా గర్మీయు డైన కెయీలా మాయకాతీయుడైన ఎష్టెమో. 
1Ch 4:20  షీమోను కుమారులు అమ్నోను రిన్నా బెన్హానాను తీలోను. ఇషీ కుమారులు జోహేతు బెన్జోహేతు. 
1Ch 4:21  యూదా కుమారుడైన షేలహు కుమారులెవరనగా లేకాకు ప్రధానియైన ఏరు మారేషాకు ప్రధానియైన లద్దాయు; సన్నపు వస్త్రములు నేయు అష్బేయ యింటి వంశకులకును 
1Ch 4:22  యోకీ మీయులకును కోజే బాయీయులకును యోవాషువారికిని మోయాబులో ప్రభుత్వము నొందిన శారాపీయులకును యాషూ బిలెహెమువారికిని అతడు పితరుడు; ఇవి పూర్వ కాలపు సంగతులే. 
1Ch 4:23  వారు కుమ్మరివాండ్లయి నెతాయీము నందును గెదేరానందును కాపురముండిరి; రాజు నియమము చేత అతనిపని విచారించుటకై అచ్చట కాపురముండిరి. 
1Ch 4:24  షిమ్యోను కుమారులు నెమూయేలు యామీను యారీబు జెరహు షావూలు. 
1Ch 4:25  షావూలునకు షల్లూము కుమారుడు, షల్లూమునకు మిబ్శాము కుమారుడు, మిబ్శా మునకు మిష్మా కుమారుడు. 
1Ch 4:26  మిష్మా కుమారులలో ఒకడు హమ్మూయేలు; హమ్మూయేలునకు జక్కూరు కుమారుడు, జక్కూరునకు షిమీ కుమారుడు. 
1Ch 4:27  షిమీకి పదునారుగురు కుమారులును ఆరుగురు కుమార్తెలును కలిగిరి; అయితే అతని సహోదరులకు ఎంతో మంది కుమారులు కలుగలేదు; యూదావారు వృద్ధియైనట్లు వారి వంశములన్నియు వృద్ధికాలేదు. 
1Ch 4:28  వారు బెయేర్షెబాలోను మోలాదాలోను హజర్షువలులోను 
1Ch 4:29  బిల్హాలోను ఎజెములోను తోలాదులోను బెతూయేలులోను 
1Ch 4:30  హోర్మాలోను సిక్లగులోను బేత్మర్కాబోతులోను హాజర్సూసాలోను బేత్బీరీలోను షరాయిములోను కాపురముండిరి. 
1Ch 4:31  దావీదు ఏలుబడి వరకు వారు ఆ పట్టణములలో కాపురముండిరి. 
1Ch 4:32  ఏతాము అయీను రిమ్మోను తోకెను ఆషాను అనువారి ఊళ్లు అయిదు. 
1Ch 4:33  బయలువరకు ఆ పట్టణముల పొలములు వారి వశమున ఉండెను; ఇవి వారి నివాసస్థలములు, వంశావళి పట్టీలు వారికుండెను. 
1Ch 4:34  వారు మెషోబాబు యమ్లేకు అమజ్యా కుమారుడైన యోషా, 
1Ch 4:35  యోవేలు అశీయేలు కుమారుడైన శెరాయాకు పుట్టిన యోషిబ్యా కుమారుడైన యెహూ. 
1Ch 4:36  ఎల్యోయేనై యహకోబా యెషోహాయా అశాయా అదీయేలు యెశీమీయేలు బెనాయా; 
1Ch 4:37  షెమయాకు పుట్టిన షిమీ కుమారుడైన యెదాయాకు పుట్టిన అల్లోను కుమారుడైన షిపి కుమారుడైన జీజా అనువారు. 
1Ch 4:38  పేళ్లవరుసను వ్రాయబడిన వీరు తమతమ వంశములలో పెద్దలైయుండిరి; వీరి పితరుల యిండ్లు బహుగా వర్ధిల్లెను. 
1Ch 4:39  వీరు తమ మందలకొరకు మేత వెదకుటకై గెదోరునకు తూర్పుననున్న పల్లపుస్థలమునకు పోయి 
1Ch 4:40  మంచి బలకరమైన మేతయు నెమ్మదియు సుఖమునుగల విశాలదేశమును కనుగొనిరి; పూర్వ మందు హాముయొక్క వంశపువారు అక్కడ కాపురముండిరి. 
1Ch 4:41  పేళ్లవరుసను వ్రాయబడియుండు వీరు యూదా రాజైన హిజ్కియా దినములలో అచ్చటికి వచ్చి అచ్చట కనబడినవారి గుడారములను నివాసస్థలములను పడగొట్టి వారిని హతముచేసి, అచ్చట తమ గొఱ్ఱలకు తగిన మేత కలిగియుండుటచేత నేటివరకు వారి స్థానములను ఆక్రమించుకొని యున్నారు. 
1Ch 4:42  షిమ్యోను కుమారులైన వీరిలో ఐదువందలమంది తమపైని ఇషీ కుమారులైన పెలట్యాను నెయర్యాను రెఫాయాను ఉజ్జీయేలును అధి పతులగా నిర్ణయించుకొని శేయీరు మన్నెమునకు పోయి 
1Ch 4:43  అమాలేకీయులలో తప్పించుకొనిన శేషమును హతముచేసి నేటివరకు అచ్చట కాపురమున్నారు. 

1వ దినవృత్తాంతములు 5

1Ch 5:1   
1Ch 5:2  యూదా తన సహోద రులకంటె హెచ్చినవాడాయెను, అతనినుండి ప్రముఖుడు బయలువెడలెను, అయినను జన్మస్వాతంత్ర్యము యోసేపు దాయెను. 
1Ch 5:3  ఇశ్రాయేలునకు జ్యేష్ఠుడుగా పుట్టిన రూబేను కుమారు లెవరనగా హనోకు పల్లు హెస్రోను కర్మీ. 
1Ch 5:4  యోవేలు కుమారులలో ఒకడు షెమయా, షెమయాకు గోగు కుమారుడు, గోగునకు షిమీ కుమారుడు, 
1Ch 5:5  షిమీకి మీకా కుమారుడు, మీకాకు రెవాయా కుమారుడు, రెవాయాకు బయలు కుమారుడు, 
1Ch 5:6  బయలునకు బెయేర కుమారుడు, ఇతడు రూబేనీయులకు పెద్ద. అష్షూరు రాజైన తిగ్లత్పిలేసెరు అతని చెరతీసికొని పోయెను. 
1Ch 5:7  వారి తరముల వంశావళి సరిచూడబడినప్పుడు వారి కుటుంబ ముల చొప్పున అతని సహోదరులలో ముఖ్యులుగా తేలినవారు యెహీయేలును, జెకర్యాయును, 
1Ch 5:8  యోవేలు కుమారుడైన షెమకు పుట్టిన ఆజాజు కుమారుడైన బెల యును. బెల వంశపువారు అరోయేరునందును నెబో వరకును బయల్మెయోనువరకును కాపురముండిరి. 
1Ch 5:9  వారి పశువులు గిలాదుదేశమందు అతివిస్తారము కాగా తూర్పున యూఫ్రటీసునది మొదలుకొని అరణ్యపు సరిహద్దువరకును వారు కాపురముండిరి. 
1Ch 5:10  సౌలు దినములలో వారు హగ్రీ యీలతో యుద్ధము జరిగించి వారిని హతముచేసి గిలాదు తూర్పువైపువరకు వారి గుడారములలో కాపురముండిరి. 
1Ch 5:11  గాదు వంశస్థులు వారికెదురుగా బాషాను దేశమందు సల్కావరకు కాపురముండిరి. 
1Ch 5:12  వారిలో యోవేలు తెగవారు ముఖ్యులు, రెండవ తెగవారు షాపామువారు. షాపామువారును యహనైవారును షాపాతువారును బాషానులో ఉండిరి. 
1Ch 5:13  వారి పితరుల యింటివారైన వారి సహోదరులు ఏడుగురు, మిఖాయేలు మెషుల్లాము షేబయోరై యకాను జీయ ఏబెరు. 
1Ch 5:14  వీరు హూరీ అనువానికి పుట్టిన అబీహాయిలు కుమారులు. ఈ హూరీ యరోయకు యారోయ గిలాదునకు గిలాదు మిఖాయేలు నకు మిఖాయేలు యెషీషైకి యెషీషై యహదోకు యహదో బూజునకు పుట్టిరి. 
1Ch 5:15  గూనీ కుమారుడైన అబ్దీ యేలునకు పుట్టిన అహీ వారి పితరుల యిండ్లవారికి పెద్ద. 
1Ch 5:16  వారు బాషానులోనున్న గిలాదునందును దాని గ్రామములయందును షారోనునకు చేరికైన ఉపగ్రామముల యందును దాని ప్రాంతములవరకు కాపురముండిరి. 
1Ch 5:17  వీరందరు యూదా రాజైన యోతాము దినములలోను ఇశ్రాయేలు రాజైన యరోబాము దినములలోను తమ వంశావళుల వరుసను లెక్కలో చేర్చబడిరి. 
1Ch 5:18  రూబేనీయులలోను గాదీయులలోను మనష్షే అర్ధ గోత్రమువారిలోను బల్లెమును ఖడ్గమును ధరించుటకును అంబువేయుటకును నేర్చినవారు, యుద్ధమందు నేర్పరులై దండుకు పోతగినవారు నలువది నాలుగువేల ఏడువందల అరువదిమంది యుండిరి. 
1Ch 5:19  వీరు హగ్రీయీలతోను యెతూరువారితోను నాపీషు వారితోను నోదాబువారితోను యుద్ధముచేసిరి. 
1Ch 5:20  యుద్ధమందు వారు దేవునికి మొఱ్ఱపెట్టగా, ఆయనమీద వారు నమ్మికయుంచినందున ఆయన వారి మొఱ్ఱ ఆలకించెను 
1Ch 5:21  గనుక వారిని జయించు టకు వారికి సహాయము కలిగెను. హగ్రీయీలును వారితో ఉన్నవారందరును వారిచేతికి అప్పగింపబడిరి; వారు ఏబది వేల ఒంటెలను పశువులను రెండులక్షల ఏబదివేల గొఱ్ఱలను రెండువేల గాడిదలను లక్ష జనమును పట్టుకొనిరి. 
1Ch 5:22  యుద్ధమందు దేవుని సహాయము వారికి కలుగుటచేత శత్రువులు అనేకులు పడిపోయిరి; తాము చెరతీసికొని పోబడు వరకు రూబేనీయులును గాదీయులును మనష్షే అర్ధగోత్రమువారును వీరి స్థానములయందు కాపురముండిరి. 
1Ch 5:23  మనష్షే అర్ధగోత్రమువారును ఆ దేశమందు కాపురముండి వర్ధిల్లుచు, బాషాను మొదలుకొని బయల్హెర్మోను వరకును శెనీరువరకును హెర్మోను పర్వతము వరకును వ్యాపించిరి. 
1Ch 5:24  వారి పితరుల యిండ్లకు పెద్దలైనవారెవరనగా ఏఫెరు ఇషీ ఎలీయేలు అజ్రీయేలు యిర్మీయా హోదవ్యా యహదీయేలు; వీరు కీర్తిపొందిన పరాక్రమ శాలులై తమ పితరుల యిండ్లకు పెద్దలైరి. 
1Ch 5:25  అయితే వారు తమ పితరుల దేవునిమీద తిరుగుబాటుచేసి, దేవుడు తమ ముందర నాశనము చేసిన జనసమూహముల దేవతలతో వ్యభిచరించిరి. 
1Ch 5:26  కాబట్టి ఇశ్రాయేలీయుల దేవుడు అష్షూరు రాజైన పూలు మనస్సును అష్షూరు రాజైన తిగ్లత్పిలేసెరు మనస్సును రేపగా అతడు రూబేనీయులను గాదీయులను మనష్షే అర్ధగోత్రమువారిని చెరపట్టి నేటికిని కనబడు చున్నట్లుగా హాలహునకును హాబోరునకును హారాకును గోజాను నదీప్రాంతములకును వారిని కొనిపోయెను. 

1వ దినవృత్తాంతములు 6

1Ch 6:1   లేవి కుమారులు గెర్షోను కహాతు మెరారి
1Ch 6:2  కహాతు కుమారులు అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీయేలు. 
1Ch 6:3  అమ్రాము కుమారులు అహరోను మోషే, కుమార్తె మిర్యాము. అహరోను కుమారులు నాదాబు అబీహు ఎలియాజరు ఈతామారు. 
1Ch 6:4  ఎలియాజరు ఫీనెహాసును కనెను, ఫీనెహాసు అబీషూవ ను కనెను, 
1Ch 6:5  అబీ షూవ బుక్కీని కనెను, బుక్కీ ఉజ్జీని కనెను, 
1Ch 6:6  ఉజ్జీ జెరహ్యాను కనెను, జెరహ్యా మెరాయోతును కనెను, 
1Ch 6:7  మెరాయోతు అమర్యాను కనెను, అమర్యా అహీటూబును కనెను, 
1Ch 6:8  అహీటూబు సాదోకును కనెను, సాదోకు అహిమయస్సును కనెను, 
1Ch 6:9  అహిమయస్సు అజర్యాను కనెను, అజర్యా యోహానానును కనెను, 
1Ch 6:10  యోహానాను అజర్యాను కనెను, ఇతడు సొలొమోను యెరూషలేములో కట్టించిన మందిరమందు యాజకత్వము జరిగించినవాడు. 
1Ch 6:11  అజర్యా అమర్యాను కనెను, అమర్యా అహీటూబును కనెను, 
1Ch 6:12  అహీటూబు సాదోకును కనెను, సాదోకు షల్లూమును కనెను, 
1Ch 6:13  షల్లూము హిల్కీయాను కనెను, హిల్కీయా అజర్యాను కనెను, 
1Ch 6:14  అజర్యా శెరాయాను కనెను, శెరాయా యెహోజాదాకును కనెను. 
1Ch 6:15  యెహోవా నెబు కద్నెజరుద్వారా యూదావారిని యెరూషలేమువారిని చెరతీసికొని పోయినప్పుడు ఈ యెహోజాదాకు చెరలోనికి పోయెను. 
1Ch 6:16  లేవి కుమారులు గెర్షోను కహాతు మెరారి. 
1Ch 6:17  గెర్షోను కుమారుల పేళ్లు లిబ్నీ షిమీ. 
1Ch 6:18  కహాతు కుమారులు అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీ యేలు. 
1Ch 6:19  మెరారి కుమారులు మహలి మూషి; వారి పితరుల వరుసలనుబట్టి లేవీయుల కుటుంబములు ఏవనగా 
1Ch 6:20  గెర్షోను కుమారుడు లిబ్నీ, లిబ్నీ కుమారుడు యహతు, యహతు కుమారుడు జిమ్మా, 
1Ch 6:21  జిమ్మా కుమారుడు యోవాహు, యోవాహు కుమారుడు ఇద్దో, ఇద్దో కుమారుడు జెరహు, జెరహు కుమారుడు యెయతిరయి. 
1Ch 6:22  కహాతు కుమారులలో ఒకడు అమీ్మనాదాబు, వీని కుమారుడు కోరహు, కోరహు కుమారుడు అస్సీరు, 
1Ch 6:23  అస్సీరు కుమారుడు ఎల్కానా, ఎల్కానా కుమారుడు ఎబ్యాసాపు, ఎబ్యాసాపు కుమారుడు అస్సీరు, 
1Ch 6:24  అస్సీరు కుమారుడు తాహతు, తాహతు కుమారుడు ఊరియేలు, ఊరియేలు కుమారుడు ఉజ్జియా, ఉజ్జియా కుమారుడు షావూలు. 
1Ch 6:25  ఎల్కానా కుమారులు అమాశై అహీమోతు. 
1Ch 6:26  ఎల్కానా కుమారులలో ఒకడు జోపై. జోపై కుమారుడు నహతు, 
1Ch 6:27  నహతు కుమారుడు ఏలీయాబు, ఏలీయాబు కుమారుడు యెరోహాము, యెరో హాము కుమారుడు ఎల్కానా. 
1Ch 6:28  సమూయేలు కుమారులు జ్యేష్ఠుడగు వష్నియు అబీయాయు. 
1Ch 6:29  మెరారి కుమారు లలో ఒకడు మహలి, మహలి కుమారుడు లిబ్నీ, లిబ్నీ కుమారుడు షిమీ, షిమీ కుమారుడు ఉజ్జా 
1Ch 6:30  ఉజ్జా కుమా రుడు షిమ్యా, షిమ్యా కుమారుడు హగ్గీయా, హగ్గీయా కుమారుడు అశాయా. 
1Ch 6:31  నిబంధన మందసమునకు స్థలము ఏర్పాటైన తరువాత యెహోవా మందిరమందు సంగీత సేవకొరకు దావీదు నియమించినవారు వీరే. 
1Ch 6:32  సొలొమోను యెరూషలేములో యెహోవా మందిరమును కట్టించువరకు వీరు సమాజపు గుడారముయొక్క ముంగిట సంగీతసేవను ఆచరించుచుండిరి; వారు వంతులచొప్పున తమ పని చూచుకొనుచుండిరి. 
1Ch 6:33  ఈ ప్రకారము తమ కుమారులతో కలసి కని పెట్టుచున్నవారెవరనగా, కహతీయుల కుమారులలో గాయకుడగు హేమాను; ఇతడు సమూయేలు కుమారుడగు యోవేలునకు పుట్టినవాడు 
1Ch 6:34  సమూయేలు ఎల్కానాకు పుట్టెను, ఎల్కానా యెరోహామునకు పుట్టెను, యెరోహాము ఎలీయేలునకు పుట్టెను, ఎలీయేలు తోయ హునకు పుట్టెను, 
1Ch 6:35  తోయహు సూపునకు పుట్టెను, సూపు ఎల్కానాకు పుట్టెను, ఎల్కానా మహతునకు పుట్టెను, మహతు అమాశైకి పుట్టెను, 
1Ch 6:36  అమాశై ఎల్కానాకు పుట్టెను, ఎల్కానా యోవేలునకు పుట్టెను, యోవేలు అజర్యాకు పుట్టెను, అజర్యా జెఫన్యాకు పుట్టెను, 
1Ch 6:37  జెఫన్యా తాహతునకు పుట్టెను, తాహతు అస్సీరునకు పుట్టెను, అస్సీరు ఎబ్యాసాపునకు పుట్టెను, ఎబ్యాసాపు కోరహునకు పుట్టెను, 
1Ch 6:38  కోరహు ఇస్హారునకు పుట్టెను, ఇస్హారు కహాతునకు పుట్టెను, కహాతు లేవికి పుట్టెను, లేవి ఇశ్రాయేలునకు పుట్టెను. 
1Ch 6:39  హేమాను సహోదరుడైన ఆసాపు ఇతని కుడిప్రక్కను నిలుచువాడు. ఈ ఆసాపు బెరక్యా కుమారుడు, బెరక్యా షిమ్యా కుమారుడు, 
1Ch 6:40  షిమ్యా మిఖాయేలు కుమారుడు, మిఖాయేలు బయశేయా కుమారుడు, బయశేయా మల్కీయా కుమారుడు, 
1Ch 6:41  మల్కీయా యెత్నీ కుమారుడు, యెత్నీ జెరహు కుమారుడు, జెరహు అదాయా కుమారుడు, 
1Ch 6:42  అదాయా ఏతాను కుమారుడు, ఏతాను జిమ్మా కుమారుడు, జిమ్మా షిమీ కుమారుడు, 
1Ch 6:43  షిమీ యహతు కుమారుడు, యహతు గెర్షోను కుమారుడు, గెర్షోను లేవి కుమారుడు. 
1Ch 6:44  మెరారీయులు ఎడమప్రక్కను నిలుచువారు; వారిలో ఏతాను కీషీ కుమారుడు, కీషీ అబ్దీ కుమారుడు, అబ్దీ మల్లూకు కుమారుడు, మల్లూకు హషబ్యా కుమారుడు, 
1Ch 6:45  హషబ్యా అమజ్యా కుమారుడు, అమజ్యా హిల్కీయా కుమారుడు, 
1Ch 6:46  హిల్కీయా అవీ్జు కుమారుడు, అవీ్జు బానీ కుమారుడు, బానీ షమెరు కుమారుడు, 
1Ch 6:47  షమెరు మహలి కుమారుడు, మహలి మూషి కుమారుడు, మూషి మెరారి కుమారుడు, మెరారి లేవి కుమారుడు. 
1Ch 6:48  వీరి సహోదరులైన లేవీయులు దేవుని మందిరస్థలముతో సంబంధించిన సకలమైన పనులకు నిర్ణయింపబడిరి. 
1Ch 6:49  అయితే అహరోనును అతని సంతతివారును దహన బలిపీఠముమీదను ధూపపీఠముమీదను ధూపమువేయుచు, అతిపరిశుద్ధస్థలపు పనినంతటిని జరుపు చుండవలెననియు, దేవుని సేవకుడైన మోషే ఆజ్ఞాపించిన అంతటిచొప్పున ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుచుండ వలెననియు వారికి నిర్ణయమాయెను. 
1Ch 6:50  అహరోను కుమారు లలో ఎలి యాజరు అను ఒకడుండెను; వీని కుమారుడు ఫీనెహాసు, ఫీనెహాసు కుమారుడు అబీషూవ, 
1Ch 6:51  అబీషూవ కుమారుడు బుక్కీ, బుక్కీ కుమారుడు ఉజ్జీ, ఉజ్జీ కుమారుడు జెరహ్య, 
1Ch 6:52  జెరహ్య కుమారుడు మెరాయోతు, మెరాయోతు కుమారుడు అమర్యా, అమర్యా కుమారుడు అహీటూబు, 
1Ch 6:53  అహీటూబు కుమారుడు సాదోకు, సాదోకు కుమారుడు అహిమయస్సు. 
1Ch 6:54  అహరోను సంతతివారగు కహాతీయులు వంతువారు; వారి కుటుంబముల పొలిమేరలలో వారు విడిసిన తావులనుబట్టి వారికి ఏర్పడిన నివాసస్థలములు ఇవి. 
1Ch 6:55  యూదా దేశములోని హెబ్రోనును దాని చుట్టునున్న యుప గ్రామములును వారికప్పగింపబడెను. 
1Ch 6:56  అయితే ఆ పట్టణపు పొలములును దాని గ్రామములును యెఫున్నె కుమారుడైన కాలేబునకు ఇయ్యబడెను. 
1Ch 6:57  అహరోను సంతతివారికి వచ్చిన పట్టణములేవనగా ఆశ్రయ పట్టణమైన హెబ్రోను లిబ్నా దాని గ్రామములు, యత్తీరు ఎష్టెమో దాని గ్రామములు, 
1Ch 6:58  హీలేను దాని గ్రామములు, దెబీరు దాని గ్రామములు, 
1Ch 6:59  ఆషాను దాని గ్రామ ములు, బేత్షెమెషు దాని గ్రామములు. 
1Ch 6:60  మరియు బెన్యామీను గోత్రస్థానములోని గెబ దాని గ్రామములు, అల్లెమెతు దాని గ్రామములు, అనాతోతు దాని గ్రామములు, వీరి వంశములకు కలిగిన పట్టణములన్నియు పదుమూడు. 
1Ch 6:61  కహాతు గోత్రీయులలో శేషించినవారికి ఎఫ్రాయిము గోత్రస్థానములోనుండియు, దాను అర్ధగోత్ర స్థానములోనుండియు, మనష్షే అర్ధగోత్ర స్థానములో నుండియు చీటిచేత పది పట్టణములు ఇయ్యబడెను. 
1Ch 6:62  గెర్షోను సంతతివారికి వారి వంశములచొప్పున ఇశ్శా ఖారు గోత్రస్థానములోనుండియు, ఆషేరు గోత్రస్థాన ములోనుండియు, నఫ్తాలి గోత్రస్థానములో నుండియు బాషానునందుండు మనష్షే గోత్రస్థానములోనుండియు పదుమూడు పట్టణములు ఇయ్యబడెను. 
1Ch 6:63  మెరారీయులకు వారి వంశములచొప్పున రూబేను గోత్రస్థానములోనుండియు, గాదు గోత్రస్థానములోనుండియు, జెబూలూను గోత్రస్థానములోనుండియు చీటిచేత పండ్రెండు పట్టణములు ఇయ్యబడెను. 
1Ch 6:64  ఈ ప్రకారముగా ఇశ్రాయేలీయులు లేవీయులకు ఈ పట్టణములను వాటి గ్రామ ములను ఇచ్చిరి. 
1Ch 6:65  వారు చీటివేసి యూదావారి గోత్రస్థానములోనుండియు, షిమ్యోనీయుల గోత్రస్థానములో నుండియు, బెన్యామీనీయుల గోత్రస్థానములోనుండియు పేరు పేరుగా చెప్పబడిన ఆ పట్టణములను ఇచ్చిరి. 
1Ch 6:66  కహాతీయులలో కొందరికి ఎఫ్రాయిము గోత్రములో పొలిమేర పట్టణములు కలిగియుండెను. 
1Ch 6:67  ఆశ్రయ పట్టణ ములును ఎఫ్రాయిము పర్వతములోని షెకెమును దావి గ్రామములును, గెజెరును దాని గ్రామములును, 
1Ch 6:68  యొక్మె యామును దాని గ్రామములును బేత్‌హోరోనును దాని గ్రామములును, 
1Ch 6:69  అయ్యాలోనును దాని గ్రామములును గత్రిమ్మోనును దాని గ్రామములును వారి కియ్యబడెను. 
1Ch 6:70  మరియు మనష్షే అర్ధగోత్రస్థానములోనుండి ఆనేరును దాని గ్రామములను బిలియామును దాని గ్రామములను కహాతీయులకు ఇచ్చిరి. 
1Ch 6:71  మరియు గెర్షోమీయులకు మనష్షే అర్ధగోత్రవంశస్థానములోనుండి బాషానునందలి గోలానుదాని గ్రామములు, అష్తారోతు దాని గ్రామములు, 
1Ch 6:72  ఇశ్శా ఖారుగోత్రస్థానములోనుండి కెదెషు దాని గ్రామములు, దాబెరతు దాని గ్రామములు, 
1Ch 6:73  రామోతు దాని గ్రామములు, ఆనేము దాని గ్రామములు, 
1Ch 6:74  ఆషేరు గోత్రస్థాన ములోనుండి మాషాలు దాని గ్రామములు, అబ్దోను దాని గ్రామములు, 
1Ch 6:75  హుక్కోకు దాని గ్రామములు రెహోబు దాని గ్రామములు; 
1Ch 6:76  నఫ్తాలి గోత్రస్థానములోనుండి గలి లయలోనున్న కెదెషు దాని గ్రామములు, హమ్మోను దాని గ్రామములు, కిర్యతాయిము దాని గ్రామములు ఇయ్య బడెను. 
1Ch 6:77  మరియు మెరారీయులలో శేషించినవారికి జెబూ లూను గోత్రస్థానములోనుండి రిమ్మోను దాని గ్రామములు, తాబోరుదాని గ్రామములు, 
1Ch 6:78  యెరికోకు ఆవల యొర్దానునకు తూర్పుగా ఉండు రూబేను గోత్రస్థానములోనుండి అర ణ్యములోని బేసెరు దాని గ్రామములు, యహజాయు దాని గ్రామములు, 
1Ch 6:79  కెదేమోతు దాని గ్రామములు, మేఫాతు దాని గ్రామములు, 
1Ch 6:80  గాదు గోత్ర స్థానములోనుండి గిలాదుయందలి రామోతు దాని గ్రామములు, మహనయీము దాని గ్రామములు, 
1Ch 6:81  హెష్బోను దాని గ్రామములు, యాజెరు దాని గ్రామములు, ఇయ్యబడెను. 

1వ దినవృత్తాంతములు 7

1Ch 7:1   
1Ch 7:2  తోలా కుమారులు ఉజ్జీ రెఫాయా యెరీయేలు యహ్మయి యిబ్శాము షెమూయేలు; తోలాకు పుట్టిన వీరు తమ పితరుల యిండ్లకు పెద్దలు; వీరు తమ తరములలో పరాక్రమ శాలులై యుండిరి; దావీదు దినములలో వీరి సంఖ్యయిరువది రెండువేల ఆరువందలు. 
1Ch 7:3  ఉజ్జీ కుమారులలో ఒకడు ఇజ్రహయా. ఇజ్రహయా కుమారులు మిఖాయేలు ఓబద్యా యోవేలు ఇష్షీయా; వీరు అయిదుగురు పెద్దలై యుండిరి. 
1Ch 7:4  వారికి బహుమంది భార్యలును పిల్లలును కలిగి యుండుటచేత వారి పితరుల యిండ్ల లెక్కను వారి వంశములలో సేనకు చేరినవారు ముప్పది ఆరువేలమంది యుండిరి. 
1Ch 7:5  మరియు ఇశ్శాఖారు వంశములన్నిటిలో వారి సహోదరులైన పరాక్రమశాలులందరు తమ వంశావళుల చొప్పున ఎనుబది యేడువేలమంది యుండిరి. 
1Ch 7:6  బెన్యామీను కుమారులు ముగ్గురు; బెల బేకరు యెదీయ వేలు. 
1Ch 7:7  బెల కుమారులు అయిదుగురు; ఎస్బోను ఉజ్జీ ఉజ్జీయేలు యెరీమోతు ఈరీ. వీరు తమ పితరుల యిండ్లకు పెద్దలు, పరాక్రమశాలులు; వీరి వంశములో చేరినవారు ఇరువది రెండువేల ముప్పది నలుగురు. 
1Ch 7:8  బేకరు కుమారులు జెమీరా యోవాషు ఎలీయెజెరు ఎల్యోయేనై ఒమీ యెరీమోతు అబీయా అనాతోతు ఆలెమెతు; వీరందరును బేకరు కుమారులు. 
1Ch 7:9  వీరు తమ పితరుల యిండ్లకు పెద్దలు, పరాక్రమశాలులు, వీరందరును ఇరువదివేల రెండువందలు. 
1Ch 7:10  యెదీయవేలు కుమారులలో ఒకడు బిల్హాను. బిల్హాను కుమారులు యూషు బెన్యామీను ఏహూదు కెనయనా జేతాను తర్షీషు అహీషహరు. 
1Ch 7:11  యెదీయ వేలు కుమారులైన వీరందరును తమ పితరుల యిండ్లకు పెద్దలు; వీరిలో యుద్ధ మునకు పోతగిన పరాక్రమ శాలులు పదునైదువేల రెండు వందలమంది యుండిరి. 
1Ch 7:12  షుప్పీము హుప్పీము ఈరు కుమారులు, అహేరు కుమారులలో హుషీము అను ఒక డుండెను. 
1Ch 7:13  నఫ్తాలీయులు బిల్హాకుపుట్టిన యహసయేలు గూనీ యేసెరు షిల్లేము. 
1Ch 7:14  మనష్షే కుమారులలో అశ్రీయేలను ఒకడుండెను. సిరియా దేశస్థురాలైన ఉపపత్ని అతని కనెను, అది గిలాదు నకు పెద్దయైన మాకీరును కూడ కనెను. 
1Ch 7:15  మాకీరు, హుప్పీము, షుప్పీముల సోదరిని పెండ్లి యాడెను. దాని సహోదరి పేరు మయకా, రెండవవానికి సెలోపెహాదని పేరు, ఈ సెలోపెహాదుకు కుమార్తెలు మాత్రము పుట్టిరి. 
1Ch 7:16  మాకీరు భార్యయైన మయకా ఒక కుమారుని కని అతనికి పెరెషు అను పేరుపెట్టెను, ఇతని సహోదరుని పేరు పెరెషు, అతని కుమారులు ఊలాము రాకెము. 
1Ch 7:17  ఊలాము కుమారులలో బెదాను అను ఒకడుండెను; వీరు మనష్షే కుమారుడైన మాకీరునకు పుట్టిన గిలాదు కుమారులు. 
1Ch 7:18  మాకీరునకు సహోదరియైన హమ్మోలెకెతు ఇషోదును అబీయెజెరును మహలాను కనెను. 
1Ch 7:19  షెమీదా కుమారులు అహెయాను షెకెము లికీ అనీయాము. 
1Ch 7:20  ఎఫ్రాయిము కుమారులలో షూతలహు అను ఒక డుండెను; అతనికి బెరెదు కుమారుడు, బెరెదునకు తాహతు కుమారుడు, తాహతునకు ఎలాదా కుమారుడు, ఎలాదాకు తాహతు కుమారుడు, 
1Ch 7:21  తాహతునకు జాబాదు కుమారుడు. వీనికి షూతలహు ఏజెరు ఎల్యాదు అనువారు పుట్టిరి; వారు తమ దేశములో పుట్టిన గాతీయుల పశువులను పట్టు కొనిపోవుటకు దిగి రాగా ఆ గాతీయులు వారిని చంపిరి. 
1Ch 7:22  వారి తండ్రియైన ఎఫ్రాయిము అనేకదినములు దుఃఖించు చుండగా అతని సహోదరులు వచ్చి అతని పరామర్శించిరి. 
1Ch 7:23  తరువాత అతడు తన భార్యను కూడగా అది గర్భము ధరించి యొక కుమారుని కనెను;తన యింటికి కీడు కలిగి నందున ఎఫ్రాయిము అతనికి బెరీయా అను పేరు పెట్టెను. 
1Ch 7:24  అతని కుమార్తెయైన షెయెరా ఉత్తరపు బేత్‌ హోరోనును దక్షిణపు బేత్‌ హోరోనును ఉజ్జెన్‌ షెయెరాను కట్టించెను. 
1Ch 7:25  వాని కుమారులు రెపహు రెషెపు; రెపహు కుమా రుడు తెలహు, తెలహు కుమారుడు తహను, 
1Ch 7:26  తహను కుమారుడు లద్దాను, లద్దాను కుమారుడు అమీహూదు, అమీహూదు కుమారుడు ఎలీషామా, 
1Ch 7:27  ఎలీషామా కుమారుడు నూను, నూను కుమారుడు యెహోషువ. 
1Ch 7:28  వారికి స్వాస్థ్యములైన నివాసస్థలములు బేతేలు దాని గ్రామములు తూర్పుననున్న నహరాను పడమటనున్న గెజెరు దాని గ్రామములు, షెకెము దాని గ్రామములు, గాజా దాని గ్రామములును ఉన్నంతవరకు వ్యాపించెను. 
1Ch 7:29  మరియు మనష్షీయుల ప్రక్కనున్న బేత్షెయాను దాని గ్రామ ములు, తానాకు దాని గ్రామములు, మెగిద్దో దాని గ్రామములు, దోరు దాని గ్రామములు వారికుండెను, ఈ స్థలములలో ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు సంతతి వారు కాపురముండిరి. 
1Ch 7:30  ఆషేరీయులు ఇమ్నా ఇష్వా ఇష్వీ బెరీయా. శెరహు వీరికి సహోదరి. 
1Ch 7:31  బెరీయా కుమారులు హెబెరు మల్కీయేలు, మల్కీయేలు బిర్జాయీతునకు తండ్రి. 
1Ch 7:32  హెబెరు యప్లేటును షోమేరును హోతామును వీరి సహోదరియైన షూయాను కనెను. 
1Ch 7:33  యప్లేటు కుమారు లెవరనగా పాసకు బింహాలు అష్వాతు, వీరు యప్లేటునకు కుమారులు. 
1Ch 7:34  షోమేరు కుమారులు అహీ రోగా యెహుబ్బా అరాము. 
1Ch 7:35  వాని సహోదరుడైన హేలెము కుమారులు జోపహు ఇమ్నా షెలెషు ఆమాలు. 
1Ch 7:36  జోపహు కుమారులు సూయ హర్నెపెరు షూయాలు బేరీ ఇమ్రా 
1Ch 7:37  బేసెరు హోదు షమ్మా షిల్షా ఇత్రాను బెయేర. 
1Ch 7:38  ఎతెరు కుమారులు యెఫున్నె పిస్పా అరా. 
1Ch 7:39  ఉల్లా కుమారులు ఆరహు హన్నియేలు రిజెయా. 
1Ch 7:40  ఆషేరు సంతతివారైన వీరందరును తమ పితరుల యిండ్లకు పెద్దలును ప్రఖ్యాతి నొందిన పరాక్రమశాలులును అధిపతులలో ముఖ్యులునై యుండిరి. ఆ వంశపువారిలో యుద్ధమునకు పోతగినవారి లెక్క యిరువది యారువేలు.